– తెలంగాణ రక్షణ సేన ఎస్టీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నేనావత్ శంకర్ నాయక్
– నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామ గ్రామానికీ తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆ పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నేనావత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి నెమలికొండ వేణుమాధవ్, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి సిద్ధి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారితో కలిసి శంకర్ నాయక్ విలేకరులతో మాట్లాడారు. ఉచిత విద్య, వైద్యం అందించడం, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించడం, సామాజిక న్యాయం సాధించడం లక్ష్యంగా కవితమ్మ ప్రజా పోరాటానికి శంఖారావం పూరించారని అన్నారు. తెలంగాణ రక్షణ సేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ముఖ్యంగా గిరిజనులు, బడుగు బలహీన వర్గాలను పార్టీతో అనుసంధానం చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి నెమలికొండ వేణుమాధవ్‌తో పాటు రాష్ట్ర నాయకులు రూప్సింగ్, కల్యాణ్ నాయక్, రవిచంద్ర, అర్చన సేనాపతి, తయితర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణారెడ్డి, బస్వరాజ్, ఎర్ధనూరు ఉప సర్పంచ్ పరమేశ్ నాయక్, విశాల్ నాయక్, నవీన్ నాయక్, ప్రకాష్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
