కేసీఆర్ నగర్ ఫేస్-02లో ఘనంగా వినాయక ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్‌లోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నగర్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువతను అభినందించారు. ముఖ్యంగా టీమ్ పవన్ […]

Continue Reading

మహనీయుల అడుగుజాడల్లో యువత నడవాలి యువజన వికాస్‌ సమితి అధ్యక్షుడు విజయకుమార్‌

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: యువత విద్యార్థి దశ నుంచే దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువజన వికాస్‌ సమితి అధ్యక్షుడు విజయకుమార్‌ అన్నారు .దేశ నిర్మాణంలో ఇంజినీరింగ్‌ రంగానికి విశిష్ట సేవలందించిన మహనీయుడు, భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి వేడుకలను పటాన్‌చెరు ప్రభుత్వ కళాశాల ఆవరణలో యువజన వికాస్‌ సమితి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను, ఇంజినీరింగ్‌ రంగంలో చేసిన విశేష కృషిని […]

Continue Reading

మేధో క్షయంపై గీతంలో చర్చాగోష్ఠి

వక్తలుగా పాల్గొన్న డాక్టర్ రథిన్ రాయ్, డాక్టర్ సుప్రీ రంజన్, సుర్వేష్ ప్రతాప్ సింగ్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ‘మేధో క్షయం రాజకీయాలను కలిసినప్పుడు: బొద్దింక జనతా పార్టీ కథ’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్), హైదరాబాదులోని రాజనీతి శాస్త్ర విభాగం సెప్టెంబరు 15న ఆలోచన రేకెత్తించే చర్చాగోష్ఠిని నిర్వహించింది.ప్రముఖ ఆర్థికవేత్త, జీఎస్ హెచ్ఎస్ డీన్ అయిన డాక్టర్ రథిన్ రాయ్ తో పాటు, రాజనీతి […]

Continue Reading

గీతంలో ఇంజనీర్ల దినోత్సవ వేడుకలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 15న మినీ హ్యాకథాన్, ఆటలు, ఆసక్తికరమైన కార్యక్రమాలతో ఇంజనీర్ల దినోత్సవం 2026ను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో వివిధ విభాగాల ఇంజనీరింగ్ విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.భారతదేశపు అత్యంత ప్రసిద్ధ ఇంజనీర్లలో ఒకరు; నీటిపారుదల, నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి రంగాలలో మార్గదర్శకుడైన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి యేటా సెప్టెంబరు 15న ఇంజనీర్ల దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా, […]

Continue Reading

సెప్టెంబ‌ర్ 17 న‌ తెలంగాణ విమోచన దినోత్సవం , ప్ర‌ధాని మోడీ జ‌న్మ‌దిన వేడుకుల‌ను రాజకీయలకు అతీతంగా జరుపుకోవాలి

-ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:  తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా జ‌రుపుకోవాల‌ని ఎమ్మెల్సీ డాక్ట‌ర్ చిన్న మైల్ అంజిరెడ్డి పిలుపునిచ్చారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో బీజేపీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. సెప్టెంబ‌ర్ 17 న తెలంగాణ విమోచ‌నం దినోత్స‌వాన్ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు బీజేపీ శ్రేణులు వాడ వాడ‌లో ఘ‌నంగా నిర్వ‌హించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ డాక్ట‌ర్ చిన్న మైల్ […]

Continue Reading

ప్రసిద్ధ దర్శకుడు సుకుమార్ ను కలిసిన గీతం అధ్యాపకుడు

పరిశోధనా ప్రతుల సమర్పణ సుకుమార్ పుస్తకానికి ముందుమాట మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ జె.డి. ప్రభాకర్, ప్రఖ్యాత భారతీయ చిత్ర నిర్మాత, దర్శకుడు, కథా సంభాషణల రచయిత సుకుమార్ ను ఇటీవల కలిశారు. దేశీయ భాషల సామాజిక-ఆర్థిక ప్రాముఖ్యతను, సుస్థిర జాతీయాభివృద్ధిలో వాటి పాత్రను వివరిస్తూ తాను చేసిన పరిశోధనను ఆయనకు అందజేశారు.డాక్టర్ ప్రభాకర్ తన మూడు […]

Continue Reading

ప్రకృతి హితమే పండుగల పరమార్థం మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రకృతి హితమే పండుగల పరమార్థమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.శనివారం పటాన్ చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

ఆచరణాత్మక అభ్యాసానికి గీతం పెద్దపీట

అధునాతన మైక్రోకంట్రోలర్లు, మెషిన్ లెర్నింగ్ పై రెండు రోజుల కార్యశాల మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల డిమాండ్లను తీర్చడానికి ఇంజనీరింగ్ విద్యార్థులను సిద్ధం చేయడంలో ఆచరణాత్మక, పరిశ్రమ-ఆధారిత అభ్యాసం యొక్క ప్రాముఖ్యతకు హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా, స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ కు చెందిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం అధునాతన మైక్రోకంట్రోలర్లపై మెషిన్ లెర్నింగ్ అనే అంశంపై రెండు రోజుల వృత్తి […]

Continue Reading

పర్యావరణ హిత గణపతే ముద్దు

సృజనాత్మక ‘ఎకో-ఏకదంత’ కార్యక్రమాన్ని నిర్వహించిన గీతం విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, గణేష్ చతుర్థిని పర్యావరణపరంగా బాధ్యతా యుతంగా జరుపుకోవడాన్ని ప్రోత్సహించేందుకు, ఆసక్తికరమైన, సృజనాత్మకమైన ‘ఎకో-ఏకదంత’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా సహజమైన మట్టిని ఉపయోగించి గణేష్ విగ్రహాలను తయారు చేసి, వారు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాలను ఎంచుకోవడం, విషపూరిత రంగులు, ప్లాస్టిక్ అలంకరణలకు దూరంగా […]

Continue Reading

ఏఐ అనలాగ్, ఇంజనీరింగ్ భవిష్యత్తుపై ఆతిథ్య ఉపన్యాసం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఆస్టర్ క్వాంటా వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రదీప్ వి.పైదా, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ఏఐ అనలాగ్, ఇంజనీరింగ్ భవిష్యత్తు’ అనే అంశంపై శుక్రవారం విజ్జానదాయకమైన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం నిర్వహించింది.ఈ ఉపన్యాసంలో ఏఐ, అనలాగ్ టెక్నాలజీల కలయిక, వీఎల్ఎస్ఐ డిజైన్, సిస్టమ్ ఆవిష్కరణలపై వాటి ప్రభావం, ఇంకా ఇంజనీరింగ్ లో అభివృద్ధి […]

Continue Reading