తెలంగాణ తొలి ముఖ్యమంత్రి   శ్రీ కేసీఆర్  తో హ్యాట్రిక్ ఎమ్మెల్యేపటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఆదివారం ఎర్రవల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్   అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. […]

Continue Reading

జడ్చర్లలో గరుడ వస్త్ర సిల్క్స్ ను ప్రారంభించిన సినీ నటి సుమ కనకాల

మనవార్తలు ప్రతినిధి,జడ్చర్ల : గరుడ వస్త్ర సిల్క్స్ తెలంగాణలో తమ తొలి బ్రాంచ్‌ను జడ్చర్లలోని నేతాజీ రోడ్డులో ప్రముఖ సినీ నటి సుమ కనకాల ప్రారంభించారు .అనంతరం సుమ కనకాల మాట్లాడుతూ జక్క శమంతకమణి, జక్క మనీషా, జక్క శ్రేయ మరియు అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన గరుడ వస్త్ర సిల్క్స్, వినియోగదారులకు అత్యుత్తమమైన మరియు ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో సంప్రదాయ మరియు ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లను విస్తృతంగా అందిస్తోందని ఆమె అన్నారు జడ్చర్ల […]

Continue Reading

​సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం  శుభపరిణామం – యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆదర్శ తపాలా కార్యాలయంగా ఆధునీకరించడంతో పాటు ప్రత్యేక పార్సెల్ నిర్వహణ విభాగం మరియు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్   స్పందించి, సంబంధిత శాఖకు పంపడం శుభపరిణామమని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ అన్నారు.ఈ సందర్బంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]

Continue Reading

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార భాగ్యశ్రీ బోర్సె చేతుల మీదుగా నాలుగవ బ్రాంచ్ గా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గుంటూరులో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ […]

Continue Reading

జర్నలిస్టు సంఘం నేత యాదగిరిని సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు యాదగిరి బి ఆర్ ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం సాయంత్రం శాలువాతో సత్కరించారు. సంగారెడ్డి లోని చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం హరీష్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు నూతన కార్యవర్గ ఎన్నిక […]

Continue Reading

బస్సు దిగే లోపే మహిళ నుంచి బంగారం చోరీ

5 తులాల బంగారం, నాలుగు వేల నగదు దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్టీసీ బస్సు దిగే లోపే ఓ మహిళ నుంచి బంగారం, నగదు దొంగతనానికి గురైన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి శాంతినగర్ కు చెందిన రేష్మ బేగం భర్త (శాండ్విక్ పరిశ్రమకు చెందిన […]

Continue Reading

బంజారాహిల్స్‌లో సువర్ణం జ్యువెల్స్ రెండో షోరూమ్ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ప్రీమియం డిజైనర్ ఆభరణాల బ్రాండ్ సువర్ణం జ్యువెల్స్ హైదరాబాద్‌లో రెండో షోరూమ్‌ను బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మోడల్స్ ఆభరణాలు ధరించి ప్రదర్శన చేశారు. మోడల్స్ ధరించిన బంగారపు డిజైన్లు సువర్ణం జ్యువెల్స్ వారి ప్రత్యేకగా తెలిపారు.సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక డిజైన్లను జోడిస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందించాలనే లక్ష్యంతో సువర్ణం సంస్థ ముందుకు సాగుతోంది.సువర్ణం జ్యువెల్స్‌లో బంగారం, వజ్రాలు, పోల్కీ, కుందన్ ఆభరణాల ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. […]

Continue Reading

ఓఆర్ఆర్ లోపలి రైతుల భూములను వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : ఓఆర్ఆర్ లోపలి రైతుల భూములను వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. ఇవాళ ఈ రోజు లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి, నష్టపోతున్న పేద రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ జోనింగ్ […]

Continue Reading

విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు రామాంజనేయులు

మనవార్తలు ప్రతినిధి, నారాయణపేట్ : సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ సభ్యులు రామాంజనేయులు తెలిపారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్న దృఢ నమ్మకంతో తాము పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నారాయణపేట్ జిల్లా ఎస్.కొల్లంపల్లి మండలంలోని ప్రజా పరిషత్ పాఠశాలలో రామాంజనేయులు తన జన్మదిన వేడుకలను విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

ఐక్యమత్యంగా సాగితేనే గుర్తింపు నీలం మధు ముదిరాజ్

ముదిరాజ్ ల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది సబ్బండ వర్గాలు, మన జాతి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా నీలం మధు ముదిరాజ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే గుర్తింపు సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ […]

Continue Reading