తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

politics Telangana

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..?

చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం లేదా..?

కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకొని న్యాయం చేయాలంటూ బిస్లరి కార్మికుల వినూత్న ఆందోళన

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని, చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారని..? సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్ బిస్లరీ యాజమాన్యంపై ధ్వజమెత్తారు.పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడ లోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (బిస్లరీ వాటర్) పరిశ్రమ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 36 రోజుకు చేరుకుంది. గురువారం కార్మికులకు న్యాయం జరగాలంటూ పరిశ్రమ వద్ద బిస్లరీ కార్మికులు కండ్లకు నల్ల రిబ్బన్ కట్టుకొని వినూత్నంగా ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ 2025 అక్టోబర్ నెలలో బిస్లరి పరిశ్రమల్లో కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నారని దీనిని సహించలేని యాజమాన్యం కక్షతో యూనియన్ జనరల్ సెక్రెటరీ తో సహా ఐదు మంది ఆఫీస్ బేరర్స్ ను తొలగించిందని, చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. 9 నెలల నుండి కార్మికులకు కంపెనీ యాజమాన్యం జీతాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు. రోడ్డున పడ్డాయని వాపోయారు. ఐదు మంది కార్మికులను యాజమాన్యం డిస్మిస్ చేయడంతో కార్మికులు అందరూ అనివార్యంగా సమ్మె చేయవలసి వచ్చిందని, 36 రోజులుగా కార్మికులు ఐక్యంగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం స్పందించక పోవడం దారుణ మన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘస్తూ కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చట్టాలు రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యానికి గౌరవం లేదా అని ప్రశ్నించారు.. తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలని, యూనియన్ ను గుర్తించి వేతన ఒప్పందం చేయాలని పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో “చలో ఐడిఏ పాశమైలారం” కార్యక్రమం చేపట్టి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా యజమాన్యాన్ని హెచ్చరించారు. యాజమాన్యం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి కార్మికులందరినీ వెంటనే వీధిలోకి తీసుకొని సమ్మెను విరమింపజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, బిస్లరీ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి నాయకులు నాగరాజు, నవీన్, అజయ్, ప్రవీణ్, సతీష్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *