పర్యావరణ హిత గణపతే ముద్దు

సృజనాత్మక ‘ఎకో-ఏకదంత’ కార్యక్రమాన్ని నిర్వహించిన గీతం విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, గణేష్ చతుర్థిని పర్యావరణపరంగా బాధ్యతా యుతంగా జరుపుకోవడాన్ని ప్రోత్సహించేందుకు, ఆసక్తికరమైన, సృజనాత్మకమైన ‘ఎకో-ఏకదంత’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా సహజమైన మట్టిని ఉపయోగించి గణేష్ విగ్రహాలను తయారు చేసి, వారు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాలను ఎంచుకోవడం, విషపూరిత రంగులు, ప్లాస్టిక్ అలంకరణలకు దూరంగా […]

Continue Reading

ఏఐ అనలాగ్, ఇంజనీరింగ్ భవిష్యత్తుపై ఆతిథ్య ఉపన్యాసం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఆస్టర్ క్వాంటా వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రదీప్ వి.పైదా, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ఏఐ అనలాగ్, ఇంజనీరింగ్ భవిష్యత్తు’ అనే అంశంపై శుక్రవారం విజ్జానదాయకమైన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం నిర్వహించింది.ఈ ఉపన్యాసంలో ఏఐ, అనలాగ్ టెక్నాలజీల కలయిక, వీఎల్ఎస్ఐ డిజైన్, సిస్టమ్ ఆవిష్కరణలపై వాటి ప్రభావం, ఇంకా ఇంజనీరింగ్ లో అభివృద్ధి […]

Continue Reading

తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.జయరాజు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.జయరాజు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, వార్షికోత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రామిక్ భవన్ లో జరిగిన సెమినార్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి జి జయరాజు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటికీ చరిత్రలో నిలిచిపోయిందని గుర్తు చేశారు. 1946 నుండి 1951 […]

Continue Reading

అమావాస్యకు అన్నదానం.. ఆకలికి ఉపశమనం !

సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఆకలి తీర్చడమే లక్ష్యం అన్నదానమే సేవా మార్గం అని నమ్మిన వ్యక్తినని సాయి లక్ష్మి డాక్యుమెంట్ రైటర్ చైర్మన్, సమాజసేవకుడు సాయిరాం గుప్తా అన్నారు .పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో ప్రతి నెల అమావాస్య సందర్భంగా తన మిత్రబృందంతో కలిసి వందలాది మందికి ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తూ సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.గత కొంతకాలంగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న ఈ సేవా […]

Continue Reading

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్ర చిరస్మరణీయం సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి అన్నారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మ వర్ధంతిని సాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ […]

Continue Reading

చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు వాజిద్ అలీ

చాకలి ఐలమ్మ ఆశయాలే మనకు స్ఫూర్తి పేదల హక్కుల కోసం పోరాడుదాం! మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు వాజిద్ అలీ అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) పటాన్‌చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక్ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ […]

Continue Reading

నకిలీ ఎక్స్‌ ఖాతా ఆధారంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డి

రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: సెప్టెంబర్ 9, 2026న తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నకిలీ ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలోని పోస్టును ఆధారంగా చేసుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేశారని, పవిత్రమైన శాసనసభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ శాసనసభ నియమావళి రూల్ […]

Continue Reading

సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రపురం : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం అన్నారు. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం 268 డివిజన్లో గల శ్రీనివాస్ నగర్ కాలనీలో బాలవిహార్ పార్క్ ముందు ఉన్నటువంటి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించిన శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం మాట్లాడుతూ కొంగు […]

Continue Reading

అంతర్జాతీయ క్రీడాపోటీలలో రాణించిన గీతం విద్యార్థిని

పికిల్ బాల్ ప్రపంచ కప్ 2026లో రెండు పతకాలు సాధించిన బీబీఏ తొలి ఏడాది విద్యార్థి ఆశ్రిత వియత్నాంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పికిల్ బాల్ ప్రపంచ కప్ 2026 పోటీలలో, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, బీబీఏ తొలి ఏడాది విద్యార్థిని ఆశ్రిత రాజు దాట్ల రెండు పతకాలు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచారు. 18 ఏళ్ల లోపు విభాగంలో పోటీపడిన ఆశ్రిత, అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, బాలికల సింగిల్స్ లో రజత పతకాన్ని, […]

Continue Reading

గీతంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కు చెందిన అప్లైడ్ సైకాలజీ విభాగం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ఆత్మహత్యల నివారణపై బహిరంగ చర్చలను ప్రోత్సహించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలతో సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పాటించింది.ఆత్మహత్యలపై కథనాన్ని మార్చడం’, ‘చర్చను ప్రారంభించండి’ అనే ఇతివృత్తంతో, మానసిక ఆరోగ్యంపై నెలకొన్న మౌనాన్ని ఛేదించడం, అలాగే వ్యక్తులు సహాయం కోరడానికి సౌకర్యవంతంగా భావించే సహాయక వాతావరణాన్ని […]

Continue Reading