టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం
టిజి ఈ జె ఏ సి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పటాన్ చెరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్షన్ విద్రోహ దినం పాటిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టీజీజాక్ రాష్ట్ర నాయకులు మరియు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్ విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని, ప్రజా ప్రతినిధులు( ఎంపీ, ఎమ్మెల్యే ) ఒక్కసారి ఎన్నికైతే జీవితాంతం పెన్షన్ పొందుతున్నప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయులు 30 , 35 సంవత్సరాలు ప్రజా సేవలో ఉండి రిటైర్మెంట్ పొందితే పెన్షన్ లేకుండా చేయడం చాలా దుర్మార్గం, అన్యాయమని, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని పి.ఎఫ్. ఆర్. డి .ఏ. చట్టం రద్దుచేసి, సిపిఎస్ విధానం లేకుండా తొలగించాలని పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించి ఉద్యోగ,ఉపాధ్యాయులందరికీ పెన్షన్ వచ్చేలా చేయాలని టి. జి. ఈ.జే.ఏ.సీ. డిమాండ్ చేస్తుందన్నారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఈనెల 10న చలో హైదరాబాద్ నిర్వహించి వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎంపీడీఓ ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై యాదగిరి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పిఆర్సి అలాగే ఆరు పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పిఆర్సి గడువు మూడు ఏళ్లు గడుసున్నప్పటికిని పిఆర్సి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని, రాష్ట్రంలో ఆరు డిఏలు పెండింగ్ లో ఉండడం ఉద్యోగులకు తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయని వెంటనే ప్రభుత్వ స్పందించాలని లేని ఎడల హైదరాబాద్ దిగ్బంధనాన్ని ప్రభుత్వం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణం రాజు,మండల విద్యాధికారి నాగేశ్వర్ నాయక్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింలు, మినిస్టరియల్ స్టాఫ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతరావు, సూపర్ డెంట్ వెంకటేశం, ఎండీ తహర్, ఖాజా, నర్సింలు, తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.
