కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తిరుమలలో భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ అనంతరం ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుభిక్షం, అభివృద్ధి చేకూరాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు గూడెం సందీప్ రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, సోమ శీనయ్య, సుధాకర్ గౌడ్, స్వామి వారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *