మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 36, లో గల మంగత్రాయ్36 లో ఫిలాంథ్రోపిస్ట్ , కళలు, ఫ్యాషన్ రంగాలపై విశేష అభిరుచి కలిగిన సుధారెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రముఖురాలు బాబీ కంధారి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపావళి, ధన్తేరస్ పండుగలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల ప్రదర్శన అక్టోబర్ 30 వరకు కొనసాగనుంది. సంప్రదాయ కళానైపుణ్యానికి ఆధునిక డిజైన్లను జోడిస్తూ రూపొందించిన అద్భుతమైన ఆభరణాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ సందర్భంగా మంగత్రాయ్36 డైరెక్టర్ మధుర్ గుప్తా మాట్లాడుతూ భారతీయ ఆభరణాల గొప్ప వారసత్వం, నైపుణ్యంతో కూడిన కళాత్మక పనితనం, మారుతున్న ఆధునిక డిజైన్ అభిరుచులను ప్రతిబింబించేలా ‘ది జ్యువెలరీ సెలూన్’ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో వజ్రాభరణాలు, సున్నితమైన పనితనంతో రూపొందించిన బంగారు హారాలు, సంప్రదాయ కుందన్, పోల్కీ ఆభరణాలతో పాటు ప్రత్యేకమైన డిజైనర్ ఆభరణాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.రోజువారీ వినియోగానికి అనువైన సొగసైన ఆభరణాల నుంచి వధువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వైభవోపేతమైన ఆభరణాల వరకు విభిన్న శ్రేణులను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. సంప్రదాయ శైలి, ఆధునిక అభిరుచులు, ప్రత్యేక సందర్భాలకు తగిన డిజైన్లతో ఈ కలెక్షన్లు ఆభరణాల ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
