ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను ఎదుర్కోవాలంటే శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, సామాజిక పరిశోధకులు కలిసి పనిచేయాలని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, జీవశాస్త్రాల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫర్హాన్ అహ్మద్ స్పష్టీకరించారు. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) యొక్క సంస్థాగత పరిశోధన కమిటీ, తన పరిశోధన సదస్సుల శ్రేణిలో భాగంగా ఎనిమిదవ సెమినార్ ను బుధవారం నిర్వహించింది. ‘

వేడెక్కుతున్న ప్రపంచం కోసం వ్యాక్సిన్ ల రూపకల్పన: డెంగ్యూపై పోరాటంలో విజ్జానం, సమానత్వం, విధానం’ అనే శీర్షికన దీనిని ఏర్పాటు చేశారు.డాక్టర్ అహ్మద్, డెంగ్యూ వ్యాప్తిపై వాతావరణ మార్పులు, పర్యావరణ కారకాల ప్రభావాన్ని వివరిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ ముప్పు గురించి చర్చించారు. వ్యాక్సిన్ ఆవిష్కర్తలుగా తమ ప్రయోగశాల ఈ సమస్యను ఎలా పరిష్కరించిందో ఆయన వివరించారు.

ఈ పరిశోధన ఫలితాలు ప్రాథమిక, ప్రీ-క్లినికల్ దశలో ఉన్నప్పటికీ, ఈ రంగాన్ని వెనక్కి నెట్టిన భద్రత, సమర్థతకు సంబంధించిన రాజీలను, మరింత తెలివైన వ్యాక్సిన్ రూపకల్పన ద్వారా పరిష్కరించవచ్చని ఇవి చూపిస్తున్నాయన్నారు.పలువురు అధ్యాపకులు ఈ చర్చలో చురుకుగా పాల్గొని, పలు సందేహాలపై వివరణలు కోరడంతో పాటు డాక్టర్ అహ్మద్ పరిశోధనా నైపుణ్యాన్ని, స్పష్టమైన వివరణను ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *