బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని డిమాండ్

-బీసీ-ఏ కోసం కదం తొక్కిన ముదిరాజులు* -జిన్నారం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ* -ఆర్‌ఐ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించిన ముదిరాజ్ నాయకులు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల ముదిరాజులు కదం తొక్కారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ సంఘాల నాయకులు, ప్రతినిధులు భారీగా తరలివచ్చి జిన్నారంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ముదిరాజ్ నాయకులు జిన్నారం తహసీల్దార్ […]

Continue Reading

క్రీడాకారులకు అండగా ఉంటాం: యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : క్రీడల్లో యువతను ప్రోత్సహించడమే యండిఆర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని మాద్రి పృథ్వీరాజ్ అన్నారు .సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్ కలిసి చిన్నారులను, కోచ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆర్థిక కష్టాలు క్రీడాకారుల ప్రతిభకు అడ్డంకి కాకూడదు అని పటాన్‌చెరు ప్రాంతంలో ఎంతోమంది దాగి ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు. […]

Continue Reading

బీహెచ్ఈఎల్ స్థల వివాదంపై న్యాయం చేయాలని స్నేహ సొసైటీ సభ్యుల విజ్ఞప్తి

– కోర్టు ఆదేశాల మేరకు సర్వే, పంచనామాతో హద్దులు నిర్ధారణ – రూ.20 లక్షలతో నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారని ఆరోపణ – తుది తీర్పు వరకు జోక్యం చేసుకోవద్దని బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విజ్ఞప్తి రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : బీహెచ్ఈఎల్ స్థలానికి సంబంధించిన వివాదంలో తమకు న్యాయం చేయాలని స్నేహ సొసైటీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని, బీహెచ్ఈఎల్ యాజమాన్యాన్ని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారికంగా సర్వే, పంచనామా నిర్వహించి తమ స్థలానికి హద్దులు […]

Continue Reading

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ ఏపూరి శివానందం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏ ఎమ్ సి ) చైర్మన్ ఏపూరి శివానందం తమ కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ దైవం, తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.​తిరుమల క్షేత్రానికి చేరుకున్న వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం గావించారు.​అనంతరం ఏపూరి శివానందం మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు […]

Continue Reading

2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి బిజెపి సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి : 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బిజెపి సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి పిలుపు నిచ్చారు .భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుదీర్ఘంగా 25 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో మచ్చలేని సేవలు అందిస్తూ, దేశానికి ప్రగతి బాటలు వేస్తున్న సుపరిపాలనకు సంకేతంగా బిజెపి సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో “సేవా జ్యోతి యాత్ర”ను బుధవారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో వైభవంగా […]

Continue Reading

అమీన్పూర్ ప్రభుత్వ విద్యారంగంలో సరికొత్త అధ్యాయం

రూ.74.50 కోట్లతో క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ.25 […]

Continue Reading

చారిత్రక అన్వేషణలో స్త్రీవాదులు

ఆతిథ్య ఉపన్యాసంలో వివరించిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఊర్వశి బుటాలియా పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, ప్రచురణకర్త, కార్యకర్త, జుబాన్ బుక్స్ సహ వ్యవస్థాపకురాలు ఊర్వశి బుటాలియా, బుధవారం హైదరాబాదులోని గీతం విశ్వవిద్యాలయంలో ‘ఆర్కైవ్ అన్వేషణలో స్త్రీవాదులు’ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) లోని ఆంగ్ల, ఇతర భాషల విభాగం నిర్వహించింది.సాంప్రదాయ చారిత్రక రికార్డులలో తరచుగా […]

Continue Reading

అక్టోబర్ 9 నుంచి ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌లోసెలబ్రిటీ దాండియా నైట్స్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  నగరంలో నవరాత్రి సందడి మొదలుకానుంది. హైదరాబాద్ మోడల్స్ , రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ సీజన్ సెలబ్రిటీ దాండియా నైట్స్ 2026, అక్టోబర్ 9 నుంచి 20వ తేదీ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐఎస్‌బీ రోడ్ లో గల ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ వేదికగా జరగనుంది.12 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సంప్రదాయ దాండియా, సంగీతం, నృత్యం, వినోదం, సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కుటుంబాలు, […]

Continue Reading

​ మోదీ 25 ఏళ్ల పాలన దేశ సుపరిపాలనకు ప్రతీక ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి : మోదీ 25 ఏళ్ల పాలన దేశ సుపరిపాలనకు ప్రతీక అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సేవా జ్యోతి యాత్ర కు ఎమ్మెల్సీ డా. చిన్నమల్లె అంజిరెడ్డి  ముఖ్య అతిథిగా  హాజరయ్యారు .అనంతరం మాట్లాడుతూ సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. […]

Continue Reading