చందానగర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

politics Telangana

పీజేఆర్ స్టేడియంలో ఘనంగా పూల పండుగ వేడుకలు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహణ

పోటెత్తిన మహిళలు.. స్టేడియం అంతా కోలాహలం

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో అంబరాన్నంటాయి. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో, శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ సమన్వయంతో నిర్వహించిన ఈ వేడుకలు కన్నుల పండువగా సాగాయి.ఈ సంబరాల్లో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు పూనుకోవడం అభినందనీయమన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్ల నుంచి మహిళలు, చిన్నారులు, కుటుంబ సమేతంగా వేలాదిమంది వేడుకలకు తరలివచ్చారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను చుట్టూ ఉంచి, సాంప్రదాయ జానపద గీతాలు ఆలపిస్తూ మహిళలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ ఆడారు. భక్తిశ్రద్ధలు, పండుగ ఉత్సాహం తోడుకావడంతో పీజేఆర్ స్టేడియం ప్రాంగణమంతా ఒక పూల పూదోటలా మారిపోయింది.ఈ వేడుకల్లో శ్రీమతి వి. పూజిత జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ “బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల గౌరవానికి మరియు ఐక్యతకు ప్రతీక. భావితరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని అందించడంలో ఇలాంటి వేడుకలు ఎంతో సహాయపడతాయి” అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *