కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

politics Telangana

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :

ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి అన్నారు.కేసీఆర్ నగర్ ఫేజ్-2లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి నాయకత్వంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేసీఆర్ నగర్ ఫేజ్-1, ఫేజ్-2కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో పాటు సాగర్, ప్రభాకర్, దయాకర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, కేసీఆర్ నగర్ ఫేజ్-1, ఫేజ్-2కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, టీమ్ పవన్ పుత్ర సభ్యులు పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *