వనపర్తి లో సీబీఎస్‌ షాపింగ్‌ మాల్‌ లో *దసరా డబుల్ ధమాకా సేల్‌ ను ప్రారంభించిన సినీనటి పాయల్ రాజపుత్

వనపర్తి ,మనవార్తలు ప్రతినిధి : శ్రీ రంగ థియేటర్ ఎదురుగా వనపర్తి లో సినీనటి  పాయల్ రాజపుత్  చేతుల మీదుగా ఘనంగా *దసరా డబుల్ ధమాకా సేల్‌ ప్రారంభించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి పాయల్ రాజపుత్ మాట్లాడుతూ . వనపర్తి కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్‌ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్‌ కాస్ట్యూమ్స్‌ కోసం తాను సీబీఎస్‌లోనే షాపింగ్‌ చేస్తానని […]

Continue Reading

తొలిరోజు ‘శ్రీ బాలా త్రిపుర సుందరి’ దేవిగా అమ్మవారి దర్శనం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని ప్రముఖ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లోకకళ్యాణార్థం, గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుతూ ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.నవరాత్రి ఉత్సవాల తొలిరోజు సందర్భంగా అమ్మవారు భక్తులకు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి దివ్య మంగళ రూపంలో దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పూజా వేదికపై […]

Continue Reading

దుర్గామాత సేవలో పర్స శ్యామ్ రావు దంపతులు

ఉస్మాన్ నగర్‌లో విగ్రహం విరాళం.. న్యూ ఎంఐజీలో ముక్కుపుడక సమర్పణ.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: పర్స శ్యామ్ రావు తెల్లాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని తెల్లాపూర్ డివిజన్ 263, ఉస్మాన్ నగర్ హనుమాన్ టెంపుల్‌లో ఆదివారం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత తొలి పూజ కార్యక్రమంలో సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు, ఆయన సతీమణి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే […]

Continue Reading

రామేశ్వరం బండ దుర్గామాత అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రుల ఉత్సవాలు

మొదటిరోజు త్రిపుర బాలసుందరిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరం బండ గ్రామంలో రామేశ్వరం బండ దుర్గామాత అసోసియేషన్ పెద్దలు అంతిరెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్, మరియు యువత ఆధ్వర్యంలో విజయదశమి దుర్గామాత నవరాత్రుల అమ్మవారి పూజలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ కుశంగల ప్రమీల, గ్రామ పెద్దలు విచ్చేసి దుర్గామాత పూజలో పాల్గొన్నారు, […]

Continue Reading

గచ్చిబౌలి డివిజన్ లో 100 మంది యువత బీఆర్ఎస్‌లో చేరిక

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల గ్రామానికి చెందిన సుమారు 100 మంది యువత ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గచ్చిబౌలి డివిజన్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా సమక్షంలో, సీనియర్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, రాగం హరి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబా యువతకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ ప్రోత్సాహంతో యువత పార్టీలో […]

Continue Reading

హఫీజ్‌పేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని బీఎల్‌వై హోమ్స్‌లో బీజేపీ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ […]

Continue Reading

దసరా, బతుకమ్మ వేడుకల్లో సేవా కార్యక్రమం

మహిళలకు చీరలు.. ఆటో డ్రైవర్లకు బహుమతులు రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పండుగ కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ నగర్ ఫేస్-1, ఫేస్-2 మహిళలకు, మున్సిపల్ సిబ్బందికి చీరలు, ఆటో డ్రైవర్లకు దుస్తులు, బహుమతులు అందజేశారు. బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలతో సంతోషాలను […]

Continue Reading