వనపర్తి లో సీబీఎస్‌ షాపింగ్‌ మాల్‌ లో *దసరా డబుల్ ధమాకా సేల్‌ ను ప్రారంభించిన సినీనటి పాయల్ రాజపుత్

Districts Lifestyle Telangana

వనపర్తి ,మనవార్తలు ప్రతినిధి :

శ్రీ రంగ థియేటర్ ఎదురుగా వనపర్తి లో సినీనటి  పాయల్ రాజపుత్  చేతుల మీదుగా ఘనంగా *దసరా డబుల్ ధమాకా సేల్‌ ప్రారంభించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి పాయల్ రాజపుత్ మాట్లాడుతూ . వనపర్తి కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్‌ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్‌ కాస్ట్యూమ్స్‌ కోసం తాను సీబీఎస్‌లోనే షాపింగ్‌ చేస్తానని తెలిపారు. ఇక్కడ లభించే డిజైన్లు, వెరైటీలు ప్రత్యేకంగా ఉంటాయని, అందుకే సీబీఎస్‌ తనకు ఎంతో ఇష్టమైన షాపింగ్‌ డెస్టినేషన్‌గా మారిందన్నారు.సీబీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జానా సురేష్‌ మాట్లాడుతూ40 ఏళ్ల అనుబంధంతో తమ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోందన్నారు. తాము ప్రారంభించిన ప్రతి షోరూంకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. వనపర్తి ప్రజల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి షోరూంను తీర్చిదిద్దినట్లు ఇప్పుడు వనపర్తి ప్రజల కోసం *దసరా డబుల్ ధమాకా సేల్‌ తీసుకొచ్చాము అని తెలిపారు.అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలతో పాటు ఆధునిక ఫ్యాషన్‌ దుస్తులను అందించడమే తమ లక్ష్యమన్నారు. అదే తమ విజయ రహస్యమని తెలిపారు. దసరా, దీపావళి పండుగలతో పాటు షోరూం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని *ప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు* అందిస్తున్నట్లు వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *