శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని బీఎల్వై హోమ్స్‌లో బీజేపీ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
