పాటి వార్డు కార్యాలయం కేటాయింపు పై గ్రామస్తుల ఆగ్రహం

politics Telangana

– నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

– న్యాయం జరిగే వరకు పోరాటం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా అవసరాల కోసం నిర్మించిన వార్డు కార్యాలయాన్ని నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ కార్యాలయానికి కేటాయించడం పై ముత్తంగి డివిజన్‌ పాటి గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, స్థానిక నాయకులు వార్డు కార్యాలయం ఎదుట బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించిన వార్డు కార్యాలయాన్ని గ్రామస్తుల ప్రయోజనాలకే వినియోగించాలని వారు డిమాండ్‌ చేశారు. గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వార్డు కార్యాలయం కేటాయింపు పై అధికారులు పునరాలోచించాలని కోరారు.ఈ విషయంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. సమస్యను రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి తమ అభ్యంతరాలను తెలియజేస్తామని వెల్లడించారు.ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచులు లక్ష్మణ్‌, స్వామి గౌడ్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *