గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారింది. గత నాలుగు రోజులుగా డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపై పొంగిపొర్లుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పాఠశాల కరస్పాండెంట్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో గత నాలుగు రోజులుగా డ్రైనేజీ పైప్ లైన్ నిండిపోయి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా క్లీన్ చేయకపోవడంతో రోడ్డుపై ప్రవహించడంతోపాటు దుర్వాసన రావడంతో పాఠశాలకు వచ్చే వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మురుగునీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ సరైన స్పందన రావడం లేదని ఆరోపించారు. ఒక పాఠశాల పరిసరాల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, కాలనీలో పరిస్థితి ఎలా ఉందో అధికారులు ఆలోచించాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ఇప్పటికైనా తక్షణం స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *