ఆగస్టు 29న అమీన్పూర్ వేదికగా పోరుబాట

22A భూముల బాధితులకు అండగా గులాబీ దళం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రాక 15 వేల మందితో భారీ నిరసన సభ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలో 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్స్, ప్లాట్ల బాధితులకు అండగా నిలిచేందుకు గులాబీ దళం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది.ఈ నేపథ్యంలో ఆగస్టు 29న పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ […]

Continue Reading

మధుమేహ సంబంధిత కంటి వ్యాధుల గుర్తింపుపై ఏఐ పరిశోధనకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లోని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని జి.కార్తీక డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డయాబెటిక్ రెటినోపతి, మధుమేహ సంబంధిత కంటి వ్యాధుల స్వయంచాలక గుర్తింపు, వర్గీకరణ కోసం డీప్ లెర్నింగ్, ట్రాన్స్ ఫార్మర్-ఆధారిత ఫ్రేమ్ వర్కుల’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ […]

Continue Reading

వారాహి సిల్క్స్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో తేజ

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్: ప్రముఖ వస్త్ర, ఆభరణాల బ్రాండ్ వారాహి తన విస్తరణలో భాగంగా వారాహి సిల్క్స్ 6.0 మరియు వారాహి సిల్వర్ జ్యువెలరీ 2.0 లను వనస్థలిపురం క్రాస్ రోడ్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరో తేజ సజ్జ కలిసి ప్రారంభించారు.వారాహి డైరెక్టర్లు మణిదీప్ యేచూరి మరియు డా. స్పందన మార్గదర్శకత్వంలో, నాణ్యత, ప్రత్యేక డిజైన్లు, సంప్రదాయం మరియు ఆధునిక షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో సంస్థ తన విస్తరణను కొనసాగిస్తోంది.వనస్థలిపురంతో పాటు […]

Continue Reading

93 సొసైటీ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నిక

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేస్–02లో 93 సొసైటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. అధ్యక్షురాలిగా బి. నళిని, ఉపాధ్యక్షురాలిగా వి. సునీత, కార్యదర్శిగా అస్మా అంజుమ్, సంయుక్త కార్యదర్శిగా కె. పవన్ జ్యోతి, కోశాధికారిగా ఎం. సునీత, డైరెక్టర్లుగా ఇష్రైతి బేగం, ఈలా పటేల్, జె. దీప, డి. పార్వతి నియమితులయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో […]

Continue Reading

సీసీ రోడ్డు రోడ్డు పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శ్రీకారం

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ : రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్‌లోని సైబర్ కాలనీ బి మ్యాథ్స్‌లో రూ.7 లక్షల వ్యయంతో 100 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ సొంత నిధులతో ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు. […]

Continue Reading

మాదాపూర్‌లో పకోడా హబ్‌ను ప్రారంభించిన సినీనటుడు వెంకట్

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్: ఫుడ్ లవర్స్‌కు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ మాదాపూర్‌లో మరో ప్రత్యేకమైన ఫుడ్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. వేడివేడిగా తయారుచేసి, కరకరలాడే క్రిస్పీ టెక్స్చర్‌తో పాటు మసాలా, స్పైసీ ఫ్లేవర్స్‌తో నోరూరించే వంటకాలను అందించే పకోడా హబ్ రెస్టారెంట్ తాజాగా ప్రారంభమైంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కింద, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను ఆదివారం సినీనటుడు వెంకట్ ప్రారంభించారు.పకోడా హబ్‌లో ప్రతి బైట్‌లోనూ క్రిస్పీ టెక్స్చర్, మసాలా ఫ్లేవర్, స్పైసీ టచ్ […]

Continue Reading

గీతం పూర్వ విద్యార్థిని మేఘనా రెడ్డికి రెండు జాతీయ మానవతా పురస్కారాలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవతా సదస్సు, అవార్డులు 2026లో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని మేఘనా రెడ్డి కొల్లి అందుకున్నారు.సుస్థిర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమాజ పరివర్తనకు ఆమె చేసిన కృషికి గాను మేఘనకు ‘యంగ్ సోషల్ వర్కర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం ప్రదానం చేశారు. ఆమె సంస్థ, ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్ (ఎం.ఆర్.ఎఫ్.ఎఫ్), ‘బెస్ట్ ఎన్జీవో ఆఫ్ […]

Continue Reading

కార్మికుల సమస్యల కోసం నిరంతర పోరాటం సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య,పి పాండురంగారెడ్డి

సిఐటియు ఉంటేనే కార్మికులకు సమ న్యాయం పోరాటాల, త్యాగాల చరిత్ర సిఐటియుది యజమాన్యాలకు లొంగని సంఘం సిఐటియు జేకే పెన్నార్ లో ఎగిరిన సిఐటియు జెండా మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కార్మికుల సమస్యల కోసం సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య,పి పాండురంగారెడ్డి లు అన్నారు.పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని జెకె ఫెన్నార్ పరిశ్రమ వద్ద శనివారం సిఐటియు జెండాను యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య […]

Continue Reading

అబద్ధపు కేసుల తీరుతెన్నులపై సదస్సు

రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించిన గీతం కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అబద్ధపు కేసుల తీరుతెన్నులను పరిశీలించి, తగిన మార్గదర్శనం చేసేందుకు గాను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి.) ఆగస్టు 21-22 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించింది. యుగాంతర్, ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐ ఐటీ) హైదరాబాద్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన […]

Continue Reading

పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్ ను ప్రారంభించిన నటి అమల అక్కినేని

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన *‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’* హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ భారతీయ హస్తకళల్లో […]

Continue Reading