దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ మండల ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ ఇస్నాపూర్ ఎక్స్ రోడ్‌లోని వినాయక (SRK) ఆటో యూనియన్ ఆధ్వర్యంలో, అలాగే ముత్తంగి డివిజన్ పరిధిలోని మణిసాయి కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ మండల ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. అనంతరం […]

Continue Reading

జెండా పండుగతో మార్మోగిన కేసీఆర్ నగర్ ఫేస్–2

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్: తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మెయిన్ గేట్‌తో పాటు బ్లాక్ 86 నుంచి 102 వరకు వివిధ బ్లాక్ లలో జాతీయ జెండాలను ఎగురవేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నగర్ ఫేస్–01 బీఆర్ఎస్ నాయకుల ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విషయాన్ని తెలుసుకున్న సోమిరెడ్డి విద్యార్థులకు […]

Continue Reading

మాదాపూర్ జడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్‌ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

– దేశాభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి – ప్రభాకర్ యాదవ్ మనవార్తలు ప్రతినిధి- శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్‌ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని […]

Continue Reading

పటాన్‌చెరులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్  అందరి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామిగా పటాన్‌చెరు నియోజకవర్గం  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రజల సహకారం సమష్టి కృషితో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం, ఎంపీడీవో, ఎమ్మార్వో, వివిధ సంక్షేమ సంఘాల కార్యాలయాలతో పాటు, మైత్రి మైదానంలో […]

Continue Reading

చిట్కుల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

అసమానతల నిర్మూలనే అసలైన స్వేచ్ఛ బడుగులకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం మహనీయుల ఆశయాలకు అనుగుణంగా రేవంత్ పాలన.. నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు పూర్తిగా తొలగిపోయినప్పుడే భారత్ నిజమైన ప్రగతి బాటలో పయనిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లోని ఎస్సీ కాలనీ, మాల బస్తి, అంగన్వాడి కేంద్రం, దుర్గమ్మ […]

Continue Reading

మియాపూర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలోజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మనవార్తలు ప్రతినిధి,మియాపూర్‌: దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవాన్ని ప్రతిబింబించేలా మియాపూర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మియాపూర్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ గారి ఆధ్వర్యంలో మియాపూర్ మెయిన్ రోడ్డు పక్కన నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీ.పి.సి.సి. జనరల్ సెక్రటరీ మరియు శేరిలింగంపల్లి […]

Continue Reading

గీతంలో ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆకట్టుకున్న కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని గాంధీజీ విగ్రహం వద్ద 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం దేశభక్తితో, ఉత్సాహంగా, ఉద్వేగంతో జరుపుకున్నారు. ఈ వేడుకలు దేశానికి, దాని గొప్ప స్వేచ్ఛా వారసత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా విద్యార్థులు, ఉన్నతాధికారులు,అధ్యాపకులు, సిబ్బందిని ఒకచోట చేర్చాయి.‘వందేమాతరం’ జాతీయ గీతం ఆలపించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ‘జన గణ మన’ జాతీయ గీతాన్ని ఆలపించారు. గీతం హైదరాబాదు అదనపు […]

Continue Reading