పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్ ను ప్రారంభించిన నటి అమల అక్కినేని

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన *‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’* హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ భారతీయ హస్తకళల్లో తరతరాలుగా వస్తున్న జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాల కథలు దాగి ఉన్నాయని అన్నారు. ‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’ వంటి కార్యక్రమాలు సంప్రదాయ కళలను నేటి తరానికి చేరువ చేయడంతో పాటు కళాకారులను ప్రోత్సహించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

మన హస్తకళలు తరతరాల జ్ఞానం, కథలు, సాంస్కృతిక వారసత్వాన్ని మోసుకొస్తున్నాయి. ఈ సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు కళాకారులకు మద్దతు అందించే వేదికగా పింక్ గులాబ్ నిలవడం అభినందనీయం. మన వారసత్వాన్ని కాపాడటం అంటే కేవలం గతాన్ని సంరక్షించడం కాదు.. ఈ అద్భుతమైన కళా నైపుణ్యాలు, కళాకారుల జీవనోపాధి భవిష్యత్ తరాలకు కొనసాగించేలా చూడల అని అమల అక్కినేని అన్నారు.

26 ఏళ్ల విద్యారంగ ప్రస్థానం అనంతరం కొత్త ప్రయాణం

పింక్ గులాబ్’ను మోహువా ఛటర్జీ స్థాపించి, క్యూరేట్ చేస్తున్నారు. చేనేతలు, వస్త్రాలు, భారతీయ హస్తకళలపై తనకున్న అభిరుచితో ఆమె ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. భారతీయ సంప్రదాయ కళలను కేవలం భద్రపరచడం కాకుండా వాటిని నేటి జీవనశైలిలో భాగం చేసి, ధరించి, ఆస్వాదించేలా చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు.దేశవ్యాప్తంగా ఉన్న స్వతంత్ర డిజైనర్లు, నేత కార్మికులు, కళాకారులు, స్వదేశీ బ్రాండ్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి ప్రత్యేకత, నైపుణ్యం, కళా సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేస్తున్నారు.మన వారసత్వానికి సమకాలీన రూపాన్ని అందించే వేదికగా పింక్ గులాబ్‌ను తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం. ప్రతి నేత, ప్రతి కుట్టు, ప్రతి చేతితో తయారైన వస్తువు వెనుక ఒక కళాకారుడి ప్రతిభ, ఒక సంప్రదాయం ఉంటుంది. ముఖ్యంగా ప్రామాణికత, అర్థవంతమైన డిజైన్‌ను కోరుకునే నేటి తరం ప్రజలకు ఈ కథలను చేరువ చేయాలనేదే నా లక్ష్యం” అని పింక్ గులాబ్ వ్యవస్థాపకురాలు, క్యూరేటర్ మోహువా ఛటర్జీ తెలిపారు.

ఈ ప్రదర్శనలో *కాంతా ఎంబ్రాయిడరీ, భారతీయ సిల్క్స్, ప్రాంతీయ చేనేత సంప్రదాయాలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సంప్రదాయ కళారూపాలు, హస్తకళలు  ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.సంప్రదాయ కళలు, చేనేతలను సంరక్షిస్తున్న కళాకారులు, వారి కుటుంబాలు, స్థానిక సమాజాలకు ప్రోత్సాహం అందించడంతో పాటు, చేతితో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌ను కల్పించడం ద్వారా సుస్థిరమైన అవకాశాలను అందించడమే పింక్ గులాబ్ లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న ‘ది హెరిటేజ్ ఎడిట్’ ద్వారా భారతీయ కళలు, చేనేతలు, హస్తకళల వైవిధ్యాన్ని నగరవాసులకు పరిచయం చేయడంతో పాటు, సంప్రదాయాన్ని ఆధునిక డిజైన్‌తో మేళవించే ప్రత్యేక అనుభూతిని అందించనున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *