sample page

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చెయ్యాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి. పాండురంగా రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమవద్ద సోమవారం శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ అక్రమార్కులను […]

Continue Reading

గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కరాటే పోటీలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. ఇటీవల గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలలో బీరంగూడకు చెందిన క్రేజీ క్రూ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రదర్శనలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో చిన్నారులను జిఎంఆర్ అభినందించారు. విద్యార్థి స్థాయి నుండి క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా […]

Continue Reading

ఆగస్టు 19న పటాన్‌చెరు యాదవ సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన యాదవ సంఘం కళ్యాణ మండపాన్ని ఆగస్టు 19న ప్రారంభించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మాజీ ప్రజా ప్రతినిధులు, యాదవ సంఘం ప్రతినిధులు, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫంక్షన్ హాళ్లు […]

Continue Reading

మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకలు

 మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు బ్యాగుల పంపిణీ శేరిలింగంపల్లి మనవార్తలు ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఎక్స్ పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు గారు హాజరై కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపారు.సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ మిరియాల […]

Continue Reading

పీపీఎల్ రాష్ట్ర ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం

-పదో తరగతి,ఇంటర్, డిగ్రీ తొలి సంవత్సరం విద్యార్థుల ప్రతిభకు గుర్తింపుగా సత్కారం  మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ ప్రగతిశీల తల్లిదండ్రుల కమిటీ (పీపీఎల్) రాష్ట్ర ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ ప్రాంగణంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి, విద్యార్థినులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్రానికి, దేశానికి మంచి […]

Continue Reading

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ అన్నారు .శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ “యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ ఫేజ్-01, ఫేజ్-02 నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సభను విజయవంతం చేసిన […]

Continue Reading

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే… పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో 1200 ల వాహనాల్లో తరలి వెళ్లిన గులాబీ శ్రేణులు.. జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పల్లెలు, పట్టణాల నుండి కదం తొక్కిన నిరుద్యోగులు, బిఆర్ఎస్ కార్యకర్తలు నిరుద్యోగుల గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి యూత్ డిక్లరేషన్ పేరుతో యువత భవిష్యత్తుకు చరమగీతం పాడారు 2028లో ఎగిరేది గులాబీ జెండాయే […]

Continue Reading

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ ధ్వనాల మధ్య పటాన్‌చెరు పట్టణంలో పూరి జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయం వద్ద హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన రథయాత్రను పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బంగారు […]

Continue Reading

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు . పటాన్‌చెరు నియోజకవర్గంలోని ముత్తంగి రింగ్‌రోడ్ సమీపంలో 45 ఆవులు ఉన్న వాహనాన్ని గుర్తించి విహెచ్‌పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిపైన గోమాఫియా దాడి చేశారు . ఈ ఘటనపై విహెచ్‌పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు […]

Continue Reading

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తిరుమలలో భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ అనంతరం ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి […]

Continue Reading