మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ :
కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ అన్నారు .శనివారం సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ “యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ ఫేజ్-01, ఫేజ్-02 నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సభను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, యువతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అరచేతిలో స్వర్గం చూపించి అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు .
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మాజీ అధ్యక్షులు ఇంద్రారెడ్డి, శ్రీపాల్, శ్రీశైలం, పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షులు చెన్నారెడ్డి, మల్లారెడ్డి, కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, ఇమ్రాన్, మొయిన్, సుధాకర్, మొయిజ్, కోటేష్ నాయక్, గోపి తదితరులు పాల్గొన్నారు.
