మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు బ్యాగుల పంపిణీ
శేరిలింగంపల్లి మనవార్తలు ప్రతినిధి :
కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఎక్స్ పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు గారు హాజరై కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపారు.సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ మిరియాల ప్రీతమ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు గిడుగు రుద్రరాజు గారి చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం ద్వారా మిరియాల ప్రీతమ్ గారు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విహెచ్ హనుమంతరావు గారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారు ఎంబీసీ మాల్ చైర్మన్ జెర్రీపాటి జైపాల్ మాజీ తాజా కార్పొరేటర్ రఘునాథరెడ్డి మెట్టు కుమార్ యాదవ్ రాగం నాగేందర్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు మిరియాల ప్రీతమ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
