గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన రాహుల్ రెడ్డి, దయాకర్ రెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రపురం:

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో శనివారం వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి తనయుడు మల్లేపల్లి రాహుల్ రెడ్డి, మాజీ టెలికామ్ బోర్డు సభ్యుడు దయాకర్ రెడ్డి, బొల్లారం శ్రీశైలం, గట్టుపల్లి మల్లేష్ పలు వినాయక మండపాలను సందర్శించారు. వివిధ మండపాల్లో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాహకులను అభినందించారు. 14వ, 21వ, 94వ, 96వ, 102వ బ్లాక్‌లతో పాటు మెయిన్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బడా గణేష్‌ను దర్శించుకున్నారు. కార్యక్రమంలో కేసీఆర్ నగర్ ఫేస్-02 బీఆర్ఎస్ నాయకులు, టీమ్ పవన్ పుత్ర సభ్యులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *