నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

politics Telangana

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం

ఐదు లక్షల రూపాయలు అందజేత

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం 

భక్తులకు స్వయంగా వడ్డించిన కాట దంపతులు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

స్వయంభుగా వెలిసిన రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భాగంగా పటాన్ చెరువు మండలంలోని నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం మిత్రబృందం తో కలిసి ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గణేష్ దేవాలయం వరకు పాదయాత్ర చేయడం జరిగింది.దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆయన సతీమణి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి విగ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య దంపతులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు.

విక్రమ్ గౌడ్ దంపతులు ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు భక్తులకు స్వయంగా అన్నదానం వడ్డించారు.ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ 200 మంది గ్రామస్తులు, భక్తులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అభినందనీయమన్నారు. ఆలయ అభివృద్ధి కోసం సర్పంచ్ విక్రమ్ గౌడ్ రూ. 5 లక్షల విరాళం అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, భక్తుల సౌకర్యార్థం తన సొంత నిధులతో రోడ్డు నిర్మించేందుకు ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సర్పంచ్ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మిత్ర బృందంతో కలిసి నందిగామ నుంచి దేవాలయం వరకు పాదయాత్ర చేయడం ఆనవాయితీ అన్నారు. ఆలయ అధికారులు అడిగిందే తడువుగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణం నుంచి తోషిబా పరిశ్రమ పక్కనుంచి రహదారి వరకు రోడ్డు నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, నాయకులు రాజి రెడ్డి, గడ్డం శ్రీశైలం, లక్ష్మారెడ్డి ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు సందీప్ గౌడ్, లక్ష్మి,పటాన్‌చెరు నియోజకవర్గం లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *