కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మైలాన్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పాశమైలారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ ఆరోపించారు. బుధవారం పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైలాన్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం తీవ్రంగా వేధింపులకు పాల్పడుతు కార్మికులను తొలగిస్తూ రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. అనేకమంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారికి చట్టం ప్రకారం బోనస్ ఇయల్స్ గ్రాట్యుటీ రావలసిన సౌకర్యాలు ఇవ్వడం లేదన్నారు. సేఫ్టీ యూనిఫామ్, షూ, క్యాంటీన్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల మీద బెదిరింపులకు పాల్పడుతూ కార్మికుల పొట్టలు కొడుతున్న మైలాన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పరిశ్రమ ముందు ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు రాజు నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *