మహనీయుల బోధనలను యువతకు చేరవేయాలి : మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్..

Districts politics Telangana

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :

వాల్మీకి మహర్షి ఆశయాలు, బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను యువతకు పరిచయం చేస్తూ, వారు చూపిన మార్గంలో నడిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం, చాప్టా (కె ) గ్రామంలో బుధవారం నిర్వహించిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేసి, ఆయన ఈ మేరకు ప్రసంగించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచించిన రామాయణం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువల ప్రాధాన్యాన్ని వాల్మీకి మహర్షి జీవితం చాటిచెబుతుందని నీలం మధు అన్నారు. సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందిస్తూ, మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే వారి సేవలకు నిజమైన గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మహనీయుల చరిత్రను భావితరాలకు అందించడం ద్వారా యువతలో స్ఫూర్తి, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు.

విగ్రహావిష్కరణలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, మహనీయులు చూపిన మార్గంలో నడిచేందుకు ప్రేరణ కలిగించాలని ఆయన సూచించారు. విద్య, సామాజిక అభివృద్ధి, సమానత్వానికి ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్వేశ్వర అంబికా శివయోగి మహారాజ్, గుండు లక్ష్మణ్ స్టేట్ PRTU మాజీ అధ్యక్షులు, గుండు మోహన్ మాజీ జెడ్పీటీసీ, సత్యనారాయణ మాజీ ఎంపీపీ, కౌన్సిలర్ రామకృష్ణ, సర్పంచులు శివరాజ్ పటేల్, కృష్ణ, సాయిలు పటేల్, వెంకటేష్, భూమయ్య, నాయకులు ప్రకాష్ రాథోడ్, వెంకట రాములు, రవి, వెంకన్న, ముచందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వాల్మీకి సంఘం నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *