వేముకుంట లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా శమీపూజ

politics Telangana

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్‌లోని వేముకుంట గౌతమినగర్ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో మంగళవారం సాయంత్రం శమీపూజ (జమ్మి పూజ) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ట్రస్టీ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, పరస్పరం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు గుర్రపు విజయలక్ష్మి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *