రవి, అనిల్ సేవాభావం

politics Telangana

-దసరా వేళ అల్పాహారం ఏర్పాటు

-మున్సిపల్ సిబ్బందికి అల్పాహారం

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :

దసరా పండుగను పురస్కరించుకుని తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేస్-2లో 65బ్లాక్ లో స్థానిక మున్సిపల్ సిబ్బందికి బీఆర్ఎస్ నాయకులు రవి, అనిల్ అల్పాహారం ఏర్పాటు చేశారు. పండుగ రోజున విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి అల్పాహారం అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది అల్పాహారం ఏర్పాటు చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ వేళ తమను గుర్తించి అల్పాహారం అందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *