బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ

politics Telangana

సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని సోమవారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు శ్రీ గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని కేటీఆర్ గారిని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆహ్వానించారు.అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *