నేటి టిఆర్ఎస్ రాజధాని రణబేరి నీ జయప్రదం చేయాలి – వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అధ్యక్షతన రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ కు సంబందించి రాజధాని రణభేరి కార్యక్రమం మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ లో జరుగుతుందనీ ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ వాసిలీ చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపాడు. ఈ సందర్భంగా గురువారం రోజు పార్టీ నాయకులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొంటారు. మియాపూర్ ఆల్విన్ సర్కిల్ నుండి నరేన్ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందనీ పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన నాయకులు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *