తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ

politics Telangana

సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) గారిని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం సాయంత్రం ఎర్రవల్లి లోని కెసిఆర్ గారి ఫామ్ హౌస్ లో.. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారితో కలిసి శ్రీ కేసీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు శ్రీ గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని శ్రీ కేసీఆర ని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆహ్వానించారు.అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కెసిఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *