నైతిక విలువల పెంపునకు పరివర్తన్ 28న

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా ఈనెల 28న పరివర్తన్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు పటాన్ చెరు జోన్ ఇంచార్జ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రమోద్ కుమార్, సంజీవ్ రావు, గీత శేఖర్, సతీష్, నగేష్, వాసు, సదాశివ రావు, ట్రస్మా రాష్ట్ర అడ్వైజర్ పూసల లింగాగౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, జిల్లా సెక్రటరీ ఆంథోనీ రెడ్డి, ట్రెజరర్ డి.నాగేశ్వర్ లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలాస్, విద్యాభారతి కార్యనిర్వాహక కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, ఐఎంసిటిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి హాజరవుతారన్నారు. పటాన్ చెరులో వారు మాట్లాడుతూ  నైతిక విద్యా బోధనలతో విద్యార్థుల్లో మార్పునకు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. తరగతి గదిలోనే రోజువారి బోధనలో భాగంగా విలువలను విద్యార్థులకు అందించడం, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా వారి ఆలోచన విధానం, పరివర్తనలో సానుకూల మార్పు తీసుకురావడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు అని తెలిపారు. విలువల ఆధారిత విద్యకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను ఆవిష్కరించనున్నారని తెలిపారు. పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *