పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల మధ్య సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నీలం పాదయాత్ర చేసారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు నీలం మధు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భరోసా కల్పించేలా ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని నీలం మధు అన్నారు.
