ఆపదలో ధైర్యంగా నిలబడాలి: సైబరాబాద్ షీ టీమ్ ఎస్‌ఐ శ్యామ్‌సుందర్

పటాన్‌చెరు శిశు విహార్ హైస్కూల్‌లో సైబరాబాద్ ‘షీ టీమ్’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు అపరిచిత వ్యక్తులు, అసభ్య ప్రవర్తన పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలి విద్యార్థినులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలి సదస్సులో పాఠశాల చైర్మన్ అనిల్ కృష్ణ పిళ్లై, హెచ్‌ఎం బినా పిళ్లై పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులకు వ్యక్తిగత భద్రత, చట్టాలపై అవగాహన ఉండడం ఎంతో అవసరమని సైబరాబాద్ పోలీస్ షీ టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌సుందర్ […]

Continue Reading

ఆర్థిక పరిజ్జానంపై యాజమాన్య వికాస కార్యక్రమం

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఈనెల 19-20 తేదీలలో నిర్వహణ ఆసక్తి ఉన్నవారికి అద్భుత అవకాశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వ్యూహాత్మక వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన ఆర్థిక పరిజ్జానం, ఆచరణాత్మక నైపుణ్యాలతో మేనేజర్లను సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఈనెల 19-20 తేదీలలో గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగం రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం (ఎండీపీ) నిర్వహించనుంది. ‘సంఖ్యల నుంచి వ్యూహం వరకు: నిర్వాహక నైపుణ్యం కోసం […]

Continue Reading

పాశమైలారం టీజీఐఐసీ హరితహారం పార్క్ భూమిని పరిరక్షించాలి: మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా కో-ఆప్షన్ మెంబర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని 10 ఎకరాల టీజీఐఐసీ హరితహారం పార్క్ భూమిని పరిరక్షించాలని కోరుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా జిల్లా స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.2015లో తెలంగాణ హరితహారం కార్యక్రమం ప్రారంభమైన సమయంలో పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో 10 ఎకరాల భూమిని పార్క్ కోసం కేటాయించారు. ఈ ప్రదేశంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం పార్క్ […]

Continue Reading

పటాన్‌చెరు పారిశుధ్యంలో నవశకం..

ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవతో 12 కోట్ల రూపాయలతో 10 స్వీపింగ్ మిషన్లు, 10 టిప్పర్లు.. తోషిబా సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు.. ప్రతి వార్డు పరిశుభ్రతకు చిరునామాగా నిలవాలి.. ప్రతి డివిజన్ కి స్వీపింగ్ మిషన్, టిప్పర్, జెసిబి.. ఎమ్మెల్యే జిఎంఆర్.. పటాన్‌చెరు మైత్రి మైదానం వేదికగా వాహనాల ప్రారంభం.. పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా పారిశుద్ధ సిబ్బందిని పెంచాలి.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే జిఎంఆర్ సూచన.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అనునిత్యం. అనుక్షణం పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, […]

Continue Reading