పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రామిరెడ్డి ఆసుపత్రి సమీపంలో వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పటాన్చెరు మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న శ్రీకాంత్ గౌడ్‌కు గురుస్వాములు, అయ్యప్ప మాలధారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు. ఆ కలియుగ దైవం అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ పడి పూజ కార్యక్రమంలో నాగరాజు స్వామి, దానయ్య గురుస్వామి, పరమేశ్వర గురుస్వామి, గోపాల్ గురుస్వామి, సురేష్ రెడ్డి గురుస్వామి, ఫాల్గుణ గురుస్వామిలతో పాటు స్థానిక నాయకులు, కాలనీవాసులు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
