ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో చెరుకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసి ఛట్ పూజ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ పటాన్‌చెరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన […]

Continue Reading

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి హెచ్.వి. రమణారావు డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డీప్ లెర్నింగ్ మోడళ్ల మూల్యాంకనంతో పాటు, ఏకీకృతం చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రేడింగ్ ను మెరుగుపరచడం’పై ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ […]

Continue Reading

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల మంది భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కార్తీక మాస శనివారాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని శాంతి నగర్ కాలనీ (గ్యాస్ గోదాం పక్కన) కొలువై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రధాన అర్చకులు మల్లికార్జున్ ఆధ్వర్యంలో […]

Continue Reading

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

– సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు – పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి – ఈ పురస్కారం మరింత బాధ్యతను పెంచింది: తేనా అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ తెల్లాపూర్, మనవార్తలు ప్రతినిధి: సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత కొన్నేళ్లుగా చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ గౌరవం […]

Continue Reading

స్కాలర్స్ ఇన్నోవిస్టా–2026 ఘనంగా ముగింపు

 -350 మంది విద్యార్థులతో శాస్త్రీయ ప్రదర్శన  – విద్యార్థుల ప్రతిభను అభినందించిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త రాజ్‌కుమార్  – విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలి  – పాఠశాల ప్రిన్సిపాల్ జనార్ధన్ రెడ్డి   పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో స్కాలర్స్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కాలర్స్ ఇన్నోవిస్టా–2026’ విద్యా ప్రదర్శన ఘనంగా ముగిసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొని తమ […]

Continue Reading

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

మై విజ్ సంస్థ సహా వ్యవస్థాపకులు అనిల్ కుమార్ మోకరాల పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా,విద్యార్థులకు అవసరమైన ఆచరణాత్మక జ్ఞానం రూపొందించేలా కార్యక్రమాలు విజ్ఞాన్ ప్రధానోపాధ్యాయురాలు పద్మవల్లి విజ్ఞాన్ విద్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ‘తరంగ్ – 2026’ ఇతివృత్తంతో విద్యార్థుల సృజనాత్మకతకు పట్టం పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనా దృక్పథాన్ని అలవర్చుకోవాలని మై విజ్ సంస్థ సహా వ్యవస్థాపకులు అనిల్ కుమార్ మోకరాల పేర్కొన్నారు.పటాన్‌చెరు మండలం చిన్న […]

Continue Reading

5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన కమ్మరి సుజాత, రామచంద్రాపురానికి చెందిన బండి సుజాతలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వారికి మంజూరైన […]

Continue Reading

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 8వ ఉచిత మెగా మెడికల్ క్యాంప్

300 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు ఉదయ్ కిరణ్ సేవా నిరతిని అభినందించిన జగదీశ్వర్ గౌడ్ మియాపూర్, మనవార్తలు ప్రతినిధి: ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో, నివ్రితి హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో మియాపూర్–మక్తా మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని నివ్రితి హోమ్స్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. ఈ […]

Continue Reading

ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో అభివృద్ధి పరుగులు  రెండు కోట్ల 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన  నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యల పరిష్కారమే అజెండా  పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: నియోజకవర్గ కేంద్రమైన పటాన్‌చెరు పరిధిలోని జెపి కాలనీ, పటాన్‌చెరు డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తూ.. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రథమ ప్రాధాన్యత […]

Continue Reading