బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు 

politics Telangana

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి:

మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు .బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్ కమ్యూనిటీ సెంటర్‌లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలకు .ముఖ్య అతిథిగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీస్ మెసేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ ఉర్ రెహమాన్ ప్రత్యేక ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా సిరాజ్ ఉర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం, సహనం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సందేశమిచ్చారు. సమాజంలో మత సామరస్యం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి, సోదరభావం, ఐకమత్యంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మునీర్, కార్యదర్శి రియాజ్ బాషా, బీహెచ్ఈఎల్ ఐఎన్ టియూసి అధ్యక్షులు రెహమాన్, మైనారిటీ నాయకులు అజీముద్దీన్, బాబా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బూన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది పేపర్ కి పెద్ది గ కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *