సుల్తాన్‌పూర్‌ లో వైభవంగా కేతమ్మ సమేత మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

దర్శించుకున్న పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి: అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ కేతమ్మ సమేత మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ దేవస్థానాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ మహోత్సవానికి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్ల ఆశీస్సులు పొందారు. విగ్రహ […]

Continue Reading

సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు కదలిరావాలి: కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరుకానున్న నేపథ్యంలో నియోజకవర్గం నుంచి […]

Continue Reading

టియుడబ్ల్యూజే హెచ్143 జాతీయ, రాష్ట్ర కౌన్సిలకు ఎంపికైన పటాన్ చెరు జర్నలిస్టులు

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్) – 143 యూనియన్ జాతీయ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్‌కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు వివిధ హోదాలకు ఎంపికయ్యారని యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.జాతీయ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు ఆనంద్ కుమార్, ప్రమోద్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు వడ్ల శ్రీధర్, కొంక […]

Continue Reading

అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని క్యాసారం గ్రామంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగింది. నక్క సత్యనారాయణ గౌడ్, నక్క మల్లేష్ గౌడ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పటాన్‌చెరు మండల బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, […]

Continue Reading

మరో మారు తన దైవభక్తిని చాటుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్..

ఆలయ నిర్మాణానికి రూ.70 లక్షల సొంత నిధులు కేటాయింపు.. సుల్తాన్పూర్ లో ఘనంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం.. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం.. అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పరమత సహనాన్ని పెంపొందిస్తూ.. సొంత నిధులతో ఆలయాలు, చర్చిలు, మసీదులు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందిస్తున్నారు. తాజాగా […]

Continue Reading

ప్రతి కార్మికుడికి పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

అగర్వాల్ రబ్బర్ కార్మికుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం  అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ గేట్ వద్ద బిఆర్టియు జెండా ఆవిష్కరణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు పరిధిలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు.. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు, అగర్వాల్ రబ్బర్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ ఎదుట ఏర్పాటు చేసిన బిఆర్టియు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి   ఎమ్మెల్యే […]

Continue Reading

హస్తకళ.. శారీరక, మేధోపరమైన అన్వేషణ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ ఎరిన్ ఓ’కానర్ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: చేతివృత్తిని (హస్తకళను) ఒక శారీరక, మేధోపరమైన అన్వేషణగా ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, గాజు తయారీ నిపుణురాలైన డాక్టర్ ఎరిన్ ఓ’కానర్ అభివర్ణించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో హస్తకళల్లో లీనమవ్వడం: మనస్సు, శరీరంపై ప్రభావాలు అనే అంశంపై సోమవారం ఆమె ఆన్ లైన్ ద్వారా ఆతిథ్య ఉపన్యాసం చేశారు.గాజు కళాకారిణిగా తన అనుభవం, […]

Continue Reading