పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని క్యాసారం గ్రామంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగింది. నక్క సత్యనారాయణ గౌడ్, నక్క మల్లేష్ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పటాన్చెరు మండల బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గురుస్వాములు, అయ్యప్ప మాలధారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
