సినీ రంగానికి వన్‌స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ‘N Media’

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :

సినిమా, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, క్యాస్టింగ్, ఈవెంట్స్‌తో పాటు డిజిటల్ ప్రమోషన్స్‌కు వేదికగా ఎన్ మీడియా వెబ్‌సైట్ ప్రారంభమైంది. సినీ దర్శకుడు శైలేష్ కొలను, నటుడు–నిర్మాత రాంకీ, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ తదితరుల చేతుల మీదుగా ఎన్ మీడియా లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లకు అవసరమైన డిజిటల్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్, పబ్లిసిటీ, బ్రాండింగ్, క్యాస్టింగ్, ఈవెంట్ ప్రమోషన్స్ వంటి సేవలను ఒకే వేదిక ద్వారా అందించాలనే లక్ష్యంతో ఎన్ మీడియా ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా సినిమాల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు డిజిటల్ ప్రమోషన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఎన్ మీడియా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

నటుడు, నిర్మాత రాంకీ మాట్లాడుతూ  మీడియాకు సంబంధించిన వివిధ విభాగాలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎన్ మీడియా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు సినీ రంగంలోకి వచ్చారని, అలాంటి వారిని ప్రోత్సహించే ఎన్ మీడియా విజయవంతం కావాలని కోరుకున్నారు.దర్శకుడు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ సినీ రంగానికి అవసరమైన సేవలను అందించే దిశగా ఎన్ మీడియా ప్రారంభించిన ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

కొత్త టాలెంట్‌కు అవకాశం.. మంచి కంటెంట్‌కు వేదిక”

ఎన్ మీడియా వ్యవస్థాపకులు రాము మాట్లాడుతూ, “సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, క్యాస్టింగ్, ఈవెంట్స్ వంటి క్రియేటివ్ రంగాలకు ఒక మంచి వేదికను అందించాలనే ఉద్దేశంతో ఎన్ మీడియా ను ప్రారంభించాం. కొత్త దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు, క్రియేటర్స్‌ను ప్రోత్సహించడంతో పాటు సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లకు డిజిటల్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్, పబ్లిసిటీ, బ్రాండింగ్ వంటి సేవలను అందించబోతున్నాం.

క్యాస్టింగ్ నుంచి ప్రొడక్షన్ వరకు, ఈవెంట్స్ నుంచి ప్రమోషన్స్ వరకు అవసరమైన సహకారం అందించేలా ఎన్ మీడియా ను రూపొందిస్తున్నాం. కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పిస్తూ, మంచి కంటెంట్‌ను ప్రేక్షకులకు చేరువ చేయడమే మా లక్ష్యం. ఎన్ మీడియా కేవలం ఒక ప్లాట్‌ఫామ్‌గా కాకుండా కొత్త టాలెంట్‌కు ఒక అవకాశం, మంచి కంటెంట్‌కు ఒక వేదికగా ఎదగాలని కోరుకుంటున్నాం” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *