బీరంగూడ అయ్యప్పస్వామి దేవాలయానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

politics Telangana

10 లక్షల రూపాయల విరాళం అందజేత

భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ

ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణం కీలకం

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఆధ్యాత్మిక సేవాభావాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం, అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు.తాజాగా బీరంగూడ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలే కాకుండా ఆధ్యాత్మిక చింతనకు, భక్తిభావానికి, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తిభావం, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడంలో ఆలయాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.బీరంగూడ గుట్టపై నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్, చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *