మరో మారు తన దైవభక్తిని చాటుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్..

politics Telangana

ఆలయ నిర్మాణానికి రూ.70 లక్షల సొంత నిధులు కేటాయింపు..

సుల్తాన్పూర్ లో ఘనంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం..

భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం..

అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి:

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పరమత సహనాన్ని పెంపొందిస్తూ.. సొంత నిధులతో ఆలయాలు, చర్చిలు, మసీదులు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందిస్తున్నారు. తాజాగా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో 70 లక్షల రూపాయల సొంత నిధులతో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాలను నిర్మించి మరోపారు తన దైవభక్తిని చాటుకున్నారు. సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించిన దేవత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో మమేకమయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలు ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా ప్రజల్లో భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందించే పవిత్ర ప్రదేశాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని తెలిపారు.సుల్తాన్‌పూర్ గ్రామంలో భక్తుల చిరకాల ఆకాంక్ష మేరకు 70 లక్షల రూపాయలతో నూతన దేవాలయాలు నిర్మించినట్లు తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు.రాబోయే రోజుల్లోనూ దేవాలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని, ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ భక్తి, ఐకమత్యంతో ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ సర్పంచ్ రాజు, పాండు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *