బీరంగూడ అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు

politics Telangana

అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి:

ఈ నెల 22వ తేదీన బీరంగూడ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించ తలపెట్టిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి   ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం భక్తుల సహాయ సహకారాలతో కేవలం 365 రోజుల సమయంలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని అన్నారు. 22వ తేదీన నిర్వహించబోయే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. అదేవిధంగా బీరంగూడ గుట్టపై రాజరాజేశ్వరి దేవి ఆలయం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మాజీ కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్, మాజీ ఎంపీటీసీ అనిల్, మాజీ సర్పంచ్ డోక్కూరి రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *