సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన : నీలం మధు ముదిరాజ్

politics Telangana

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.
గురువారం ఇందిరాగాంధీ 109 వ జయంతి పురస్కరించుకొని చిట్కూల్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో, పేదలకు ఆమె అందించిన సంక్షేమాని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దగ్గరికి చేసి భారతీయుల గుండెలో ఇందిరా గాంధీ పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తు ఈరోజు సిద్దిపేట లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్టు నీలం తెలిపారు, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ సంగన్నగారి గోపాల్, దస్తగిరి, సందీప్ గౌడ్, నాయకులు ముత్తంగి అశోక్, దండోరా నరసింహ, సందీప్ యాదవ్, ముత్యాలు, వీరేష్, గణేష్, అనిల్ రంజిత్, కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *