ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో ఇష్టా విద్యాసంస్థలవిద్యార్థులకు ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు బీరంగూడ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ పేర్కొన్నారు.ఇష్టా విద్యా సంస్థల ఫౌండర్, మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటి చుక్కా రామయ్య101వ పుట్టినరోజు సందర్భంగా ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట, విద్యా సంస్థల అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్, పటేల్ గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ జె.రజిత,బీరంగూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ జె.తులసి విద్యాసంస్థల ఫిజికల్ డైరెక్టర్ డి రమేష్ విద్యానగర్ ఐఐటి చుక్కారామయ్య నివాసంలో కేక్ కట్ చేసి 101 వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యాసంస్థలలో ఘనంగా జరుపుకున్నారు. పటాన్ చెరు,పటేల్ గూడ , బీరంగూడ బ్రాంచీలలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కుమార్ మాట్లాడుతూ ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని నాణ్యమైన విద్యని అందిస్తున్నామని, మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పటేల్ గూడ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపల్ విజయభాస్కర్ రెడ్డి, బీరంగూడ బ్రాంచ్ పోస్ట్ ప్రిన్సిపల్ పి పవన్ కుమార్ తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
