శేరిలింగంపల్లి టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గూడ లావణ్య నేత నియామకం

politics Telangana

– నియామకం పత్రం అందజేసిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గూడ లావణ్య నేత నియమితులయ్యారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గ ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధినేత్రి కవిత ఆశయాలకు అనుగుణంగా, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని లావణ్య నేత పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మహిళలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సాధికారతతో పాటు సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *