అంబేద్కర్ జీవితం సదా ఆచరణీయం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరాలకు సదా ఆచరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించి, ప్రతి ఒక్కరికి సమానత్వం, సౌబ్రాతత్వం, రిజర్వేషన్లు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. అన్ని వర్గాల వారికి […]

Continue Reading

అదిరేటీ డ్రస్సు మేమేస్తే

మనవార్తలు ,హైదరాబాద్: లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో ఎవాల్వ్ (Evolve) పేరు తో నిర్వహించిన్న కిడ్స్ ఫ్యాషన్ షో లో చిన్నారులు అదరగొట్టారు లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫ్రెషేర్స్ డే పార్టీ 2023 స్టూడెంట్స్ స్టెప్పులతో అదరహో అనిపించారు.త్మవిశ్వాసానికి ప్రతికల్లా మెరిసిపోయిన చిన్నారులు తమదైన బుడి బుడి నడకలతో ర్యాంప్ నకు అందాన్ని తెచ్చారు.ముద్దు లొలికే చిన్నారులు లకోటీయా ఇనిస్టిట్యూట్ ఫ్యాషన్ స్టూడెంట్స్ డిజైన్ చేసిన డ్రెస్సులో ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు. […]

Continue Reading

సీపీఆర్ పై విద్యార్థులకు అవగాహన

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సెన్సైస్ (ఎన్బీఈఎంఎస్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్స్ ఫోరమ్ (ఐసీఏ-ఎస్ఎఫ్)ల సంయుక్త సౌజన్యంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం హఠాత్తుగా ఒక మనిషి కుప్పకూలినప్పుడు (కార్డియోసల్మనరీ రిససిటేషన్ – సీపీఆర్) నిర్వహించాల్సిన ప్రక్రియపై విద్యార్థులకు వర్చువల్ గా శిక్షణనిచ్చారు. ఈ దేశవ్యాప్త ప్రజా అనగాహనా కార్యక్రమంలో పాల్గొనేవారికి సీపీఆర్ శిక్షణ ఇవ్వడమే గాక, ప్రాణాలను రక్షించే సాంకేతికత ప్రాముఖ్యతను వివరించారు.సీపీఆర్ అనేది గుండె […]

Continue Reading

విద్యా పరిశోధన కోసం గీతం ఫ్రొఫెసర్ కు యూకే ఆహ్వానం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్టిలోని గణిత శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ మోతహర్ రెజా ఈనెల 1 నుంచి 15 తేదీ వరకు విద్యా పరిశోధన చేపట్టడానికి యునెటైడ్ కింగ్డమ్ (బ్రిటన్)లోని డూండీ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ఆహ్వానించింది.యూనివర్సిటీ ఆఫ్ డూండీలోని ఎన్విరాన్మెంటల్ ఫ్యూయిడ్ మెకానిక్స్ లెక్చరర్ డాక్టర్ అనిర్బన్ గుహా ‘స్లిప్వాల్ ఎఫెక్ట్స్ ఆన్ మెక్రోచానెల్ ఫ్లూయిడ్ స్టెబిలిటీ అండ్ బయోమెడికల్ డివెస్ట్ అప్లికేషన్స్’ అనే అంశంపై పరిశోధన […]

Continue Reading

హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యత పెంచింది_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రగతిరథ సాధకుడికి అభినందనల వెల్లువ _ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సంక్షేమాన్ని మరింత విస్తృతం చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఇటీవల జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా సోమవారం పటాన్చెరు […]

Continue Reading

వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బీ.టెక్ తొలి ఏడాది విద్యార్థులు సోమవారం తమ వినూత్నమైన ప్రాజెక్టులకు ప్రదర్శించారు. సాంకేతిక అన్వేషణ, ఉత్పత్తి ఇంజనీరింగ్ (టీఈపీ టెప్) కార్యక్రమంలో భాగంగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అభివృద్ధి చేసిన వినూత్న ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను గీతం విద్యార్థులు నిర్వహించారు.బీటెక్ తొలి ఏడాది విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నెపుణ్యాలను పెంపొందించడం, ప్రయోగాత్మక విధానాన్ని పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి […]

Continue Reading

గీతం స్కాలర్ తనూ శ్రీవాస్తవకు పీహెచ్ డీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని తనూ శ్రీవాస్తవను డాక్టరేట్ వరించింది. ఏరోస్పేస్ అప్లికేషన్స్ కోసం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమెపై అభివృద్ధి, అధ్యయనం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ కుమార్ కూరి, ప్రొఫెసర్ రావూరి బాలాజీరావు శుక్రవారం విడుదల […]

Continue Reading

ఆరోగ్య పరిరక్షణలో ఐవోటీది కీలక భూమిక

_గీతం అధ్యాసక నికాస కార్యక్రమంలో ఐఐటీ హెదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ ఆచార్య పటాన్‌చెరు,నవంబర్ 22 (మనవార్తలు ) ఆరోగ్య పరిరక్షణలో ఐనోటీ కీలక భూమిక పోషిస్తోందని బఐటీ హెదరాబాద్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ ఆచార్య అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈతసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు రోజుల ఆధ్యాపక వికాస కార్యక్రమంలో భాగంగా, గురువారం ఆయన ‘ఐనోటీ చిక్కులు: శక్తి, పనితీరు, కృత్రిమ మేథ’ అనే అంశంపై ఉపన్యసించారు. ఆరోగ్య […]

Continue Reading

అంతర్జాతీయ పత్ర సమీక్ష చేయనున్న గీతం అధ్యాపకుడు

మనవార్తలు _పటాన్ చెరు అమెరికా (ఫ్లోరిడా)లోని గ్రేటర్ మయామిలో వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీక్షించడానికి గీతం అధ్యాపకుడికి అవకాశం లభించింది. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ హేమరాజు పొల్లాయి ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు సమీక్షకుడిగా ఎంపికయ్యారు.డాక్టర్ హేమరాజు పీహెచ్ఎ పట్టాను మనదేశంలోనే అత్యుత్తము విద్యాసంస్థగా పేరొందిన బెంగళూరులోని ఐఐఎస్సీ నుంచి పొందగా, పోస్ట్-డాక్ డిగ్రీని UtahState-USA నుంచి పూర్తిచేశారు. […]

Continue Reading

పటాన్చెరులో అంబరాన్ని అంటిన కేసరి లాల్ యాదవ్, అక్షర సింగ్ సంగీత విభావరి

_తరలివచ్చిన ఉత్తర భారతీయులు పటాన్‌చెరు,నవంబర్ 22 (మనవార్తలు ) మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలేనని, ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం, ఛట్ పూజ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ శివారులోని ఎల్లంకి కళాశాల సమీపంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. […]

Continue Reading