గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల 27న చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను జయప్రదం చేయండి_సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న తలపెట్టిన చలో సంగారెడ్డి కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని సోమవారం పట్టణంలోని శ్రామిక భవన్ లో ఆ సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల సాధన కోసం గత 19 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. […]
Continue Reading