అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

politics Telangana

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత

మనవార్తలు ప్రతినిధి,మియాపూర్:

తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్ వేదిక వరకు ప్రణవ్ సాగిస్తున్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు మరియు యువజన సేవల శాఖల గౌరవ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి అన్నారు.యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , చైర్మన్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ప్రణవ్ మాధవ్ సురపనేని అభినందించారు.ప్రణవ్ మాధవ్ సురపనేనిని ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేవలం 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ తెలంగాణతో పాటు భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న ప్రణవ్ మాధవ్ సురపనేని సాధించిన విజయాలను అడిగి తెలుసుకొన్నారు .క్రీడల పట్ల ప్రణవ్ చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల మరియు ప్రతిభకు సాధించిన విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు.తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్ వేదిక వరకు ప్రణవ్ సాగిస్తున్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించి, వారికి అవసరమైన అవకాశాలు మరియు సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రణవ్ వంటి యువ ప్రతిభావంతులు తెలంగాణ క్రీడా రంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు, భారతదేశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *